కాకినాడలోని జేఎన్‌టీయూలో సీఐఐ ప్రాంతీయ సదస్సు జరుగుతోంది. ఇందులో ఓడీఓపీ, ఎంఎస్‌ఎంఈ ఎగ్జిబిషన్‌ స్టాళ్లు ఏర్పాటు చేశారు. స్థానిక పారిశ్రామికవేత్తలకు వ్యాపార అవకాశాలు, రాయితీలు, రుణాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఉపముఖ్యమంత్రి కె. పవన్‌ కల్యాణ్‌, పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్‌, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్దన్‌ రెడ్డి హాజరయ్యారు.