తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించారు. కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన నేరుగా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇరువురు నేతలు ఒక గంట పాటు పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా నీటిపారుదల, నదుల అనుసంధానంపై దృష్టి సారించారు. తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి నీరు అందిస్తున్నందుకు తమిళనాడు సీఎం విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ తాగునీరు అందించాలని కోరారు.