రామ్ చరణ్, సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న 'ఆర్సీ17' సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఇంకా షూటింగ్ ప్రారంభం కాకముందే విశేష బజ్ తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్, ముహూర్తం వీడియో ప్రోమోతో ఈ సినిమాలో చరణ్ పాత్రపై అభిమానుల్లో సరికొత్త అంచనాలు, ఊహాగానాలు మొదలయ్యాయి.