'సమాజవరగమన' విజయం తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్లో 'ఫ్యామిలీ ప్యాక్' చిత్రం రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ వినోదాత్మక చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. దీపావళి సందర్భంగా శ్రీవిష్ణు కొత్త లుక్‌తో కూడిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.