క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపుపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'క్యాన్సర్ రన్' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్, ఎన్. రాంచందర్ రావు, అరికెపూడి గాంధీ, వీసీ సజ్జనార్, రమేష్ రెడ్డిలతో పాటు క్రీడాకారులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.