తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అశోక్ కుమార్, శ్రీనివాస్, కన్నం మధు, సురేష్ కాలేరు, మల్లారెడ్డి, టి. రాజు, అరవింద్ తదితరులు పాల్గొని తానిపర్తి చికితకు అభినందనలు తెలిపారు. ఆమె తల్లిదండ్రులను కూడా ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ వేదికపై రెండు స్వర్ణ పతకాలు సాధించిన విజయాన్ని అధికారులు ప్రశంసించారు. చికిత ఆసియా క్రీడల్లో సాధించిన విజయంపై ఆనందాన్ని వ్యక్తపరిచి, భవిష్యత్తులో మరింత మెడల్స్ సాధించాలనే ఆశను వ్యక్తం చేశారు.