పార్వతీపురం మన్యం జిల్లా చినమేరంగి పోలీస్‌స్టేషన్‌లో శనివారం ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. జిల్లా ఎస్పీ ఎస్‌.వి. మాధవ్‌రెడ్డి ఆదేశంతో చినమేరంగి, తాళ్లడుమ్మ గ్రామాల్లో విస్తృత తనిఖీలు. సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ ఏ. నీలకంఠరావు, ఎస్‌ఐ ప్రశాంత్, ఎస్‌ఐ పకృద్ధిన్, ఎస్‌ఐ భాస్కరరావు, పీసీ సురేష్‌కుమార్ నేతృత్వంలో హాట్‌స్పాట్ ప్రాంతాల్లో సోదాలు. మాదకద్రవ్య వినియోగ అనుమాన ప్రాంతాలు, అద్దె ఇళ్లు, ఖాళీ భవనాలు, ద్విచక్ర వాహనాలు తనిఖీ చేసి, అనుమతి పత్రాలు పరిశీలించారు.