బొల్లారంలో ఆరేళ్ల చిన్నారి హత్య కేసులో పోలీసులు సెక్యూరిటీ గార్డును అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని కిడ్నాప్ చేసి, నడుముకు ఇటుకలు కట్టి వాటర్ ట్యాంక్‌లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. రూ. 20 లక్షలు డిమాండ్ చేసిన నిందితుడితో పాటు మరో నలుగురు సెక్యూరిటీ గార్డులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.