భారత జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతోందని స్వదేశీ జాగరణ్ మంచ్ పేర్కొంది. బిలియనీర్ ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, స్టార్‌లింక్ సేవలపై నిషేధం విధించాలని ఎస్జేఎం జాతీయ కో-కన్వీనర్ అశ్విని మహాజన్ డిమాండ్ చేశారు. లేజర్ ఆధారిత శాటిలైట్ లింకుల ద్వారా డేటా బదిలీ జరుగుతోందని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు.