అమెరికా పౌరులను బెదిరించి ₹261 కోట్లు వసూలు చేసిన ముఠాను ఈడీ పట్టుకుంది. నిందితులు ఫేక్ కాల్ సెంటర్ల ద్వారా 20 లక్షల మంది డేటా సేకరించారు. డ్రగ్స్, మనీలాండరింగ్ పేరిట నకిలీ ఐడీలతో భయపెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని, తాజాగా మరో నలుగురిని ఈడీ అదుపులోకి తీసుకుంది.