సౌదీ అధికారులు కొన్ని క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేశామని చెబుతున్నారు, కానీ కొన్ని లక్ష్యాలను చేరుకున్నాయి. ఆధునిక రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ దాడులన్నింటినీ అడ్డుకోవడం ఎందుకు కష్టమవుతోందనే ప్రశ్న తలెత్తింది. హూతీల క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యం పెరగడమే దీనికి కారణమా? వివిధ రక్షణ వ్యవస్థల మధ్య సమాచార మార్పిడి, సమన్వయంలో సమస్యలున్నాయా?