జిబౌటి తీరంలో 305 మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడి 139 మంది మృతి చెందారు. 15 మంది చిన్నారులు ఉన్నారు. గురువారం రాత్రి ఒబోక్ ఉత్తర ప్రాంతంలోని గుహెరే సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 84 మంది గల్లంతు కాగా గాలింపు కొనసాగుతోంది. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడ్డారు. బాధితులంతా ఇథియోపియా దేశానికి చెందినవారే. వీరిని ఒబోక్‌లోని ఐఓఎం రెస్క్యూ సెంటర్‌కు తరలించారు.