మంచిర్యాల జిల్లా నస్పూర్ గేటు వద్ద లారీ, ఆటో ఢీకొని ఇద్దరు మరణించారు. మృతులు అత్తలి సౌందర్య, చింతకుంట లక్ష్మి, మందమర్రి మండల గుడిపెల్లి పొన్నారం గ్రామస్థులు. మరో ఐదుగురికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది, రూరల్ సీఐ రవీందర్ తెలిపారు. గాయపడినవారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.