యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఐపీఎస్ అధికారి అక్షయ్ కుమార్ కీలక సూచనలు ఇచ్చారు. ఆయన సివిల్స్ విజయం జీవిత లక్ష్యం కాకూడదని, దేశ సేవకు అనేక మార్గాలు ఉన్నాయని, ఫెయిల్ అయితే జీవితం ముగిసినట్లు కాదు అని చెప్పారు. సివిల్స్ ప్రిపరేషన్, వ్యక్తిగత జీవితం, నేరాల స్వభావం, సైబర్ నేరాల జాగ్రత్తలు వంటి అంశాలపై సిగ్నేచర్ స్టూడియోస్‌తో ఇంటర్వ్యూలో మాట్లాడారు. అభ్యర్థులు ముందుగా తమ లక్ష్యంపై స్పష్టత తెచ్చుకుని, ఎందుకు యూపీఎస్సీకి చేరాలనుకుంటున్నారో ప్రశ్నించుకోవాలని ఆయన సూచించారు.