వేములవాడలో శుక్రవారం రాత్రి రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఆయన ఒలింపిక్ జెండాను ఆవిష్కరించి టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ప్రారంభోత్సవంలో ఆయన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతె, క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 28 జట్లకు చెందిన 1,300 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. పోటీలు అక్టోబర్ 2 నుంచి 5 వరకు కొనసాగుతాయి.