మంగళగిరి, గుంటూరు జిల్లా, శనివారం శ్రీసిటిలో బాయిలర్ పేలుడు ఘటనలో కార్మికులు మృతి చెందడంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ప్రభుత్వం అండగా ఉంటుందని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు ఘటనను సమగ్రంగా పరిశీలించి, భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.