పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి సోమవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి, కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు వంటి ఆరు ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా విచారణ చేసి, చట్టపరంగా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.