ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో ప్రారంభించిన పీఎం రాహత్ పథకం ప్రకారం రోడ్డు ప్రమాదంలో పేద బాధితులకు 7 రోజుల పాటు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్య సహాయం లభిస్తుంది. గోల్డెన్ అవర్‌లో సరైన చికిత్స ద్వారా సగం మంది ప్రాణాలు రక్షించబడతాయి. 112 హెల్ప్‌లైన్ ద్వారా సమీప ఆసుపత్రి, అంబులెన్స్ వివరాలు పొందవచ్చు.