అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS) వర్క్ పర్మిట్ రెన్యూవల్ కోసం ఆటోమేటిక్ పొడిగింపును శాశ్వతంగా రద్దు చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, దరఖాస్తుదారులు తమ పర్మిట్ గడువు ముగిసేలోపు రెన్యూవల్ కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అది ఆమోదమయ్యే వరకు ఆటోమేటిక్‌గా పని చేసే హక్కు లభించదు. ఈ నిబంధన అక్టోబర్ 14న ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురితమైన తర్వాత 30 రోజుల వ్యవధిలో అమల్లోకి వస్తుంది.