ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా తమ వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 837 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, ఎంబీఏ, సంబంధిత అనుభవం ఉన్నవారు నవంబర్ 4 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులే 791 ఉన్నాయి.