ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం విమాన సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణానికి పౌర విమానయాన శాఖ సైట్ క్లియరెన్స్ ఇచ్చింది. దీనితో పాటు అమరావతి, ఒంగోలు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లోనూ విమానాశ్రయాల అభివృద్ధికి సీఎంగా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కుప్పం, శ్రీకాకుళం ఎయిర్పోర్టులకు కేంద్రం క్లియరెన్స్


