కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు టోల్ ప్లాజా వద్ద గురువారం ఉదయం 8 గంటల నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కార్లకు రూ.160, భారీ వాహనాలకు రూ.1020 వరకు ఛార్జీలు నిర్ణయించారు. దీంతో రవాణా ఖర్చులు పెరిగి ఆర్టీసీ బస్సు ఛార్జీలు, నిత్యావసర ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.