శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీప రెవెన్యూ భవనంలో ‘జోష్’ బృందాల ప్రారంభోత్సవం జరిపి, టీబీ ముక్త్ భారత్ కమిటీ ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డి.ఎమ్.హెచ్.ఓ డాక్టర్ సునీల్ కుమార్, డీటీఓ డాక్టర్ అనుపమ జేమ్స్, ఎంఓడీటీసీ డాక్టర్ జె. ప్రణయ్, టీబీ విభాగం సిబ్బంది హాజరయ్యారు. 10 మంది సభ్యులతో కూడిన ‘జోష్’ బృందాలు క్లాస్‑1 బ్లాక్ నోడల్ అధికారుల నేతృత్వంలో రంగంలోకి ప్రవేశించాయి.