రాజమహేంద్రవరం దివాన్‌చెరువులోని వీజేఎస్‌ ఫార్మసీ కళాశాల విద్యార్థులు యాంటీబయోటిక్స్ వినియోగంపై వీధి నాటకం నిర్వహించారు. నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు వైద్యుల సూచన లేకుండా యాంటీబయోటిక్స్ తీసుకోవద్దని, నిర్ణీత మోతాదు, చికిత్సా కాలం పాటించాల్సిన అవసరాన్ని వివరించారు.