పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. చర్లపల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్ల నుంచి ఢిల్లీ, బెంగళూరు, బిహార్ మార్గాల్లో వందలాది సీట్లు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 28 నుంచి నవంబర్ నెలాఖరు వరకు ఈ రైళ్లలో బెర్తుల లభ్యత ఉంటుందని అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపారు.