స్మార్ట్ టీవీని చూడేటప్పుడు స్క్రీన్ ప్రకాశం, బ్యాక్‌లైట్, పిక్చర్ మోడ్ వంటి సెట్టింగ్స్ విద్యుత్ వినియోగాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. రాత్రంతా ఆన్‌లో ఉంచడం, మ్యూజిక్ వింటూ స్క్రీన్ ఆన్‌లో ఉంచడం వంటి అలవాట్లు వినియోగాన్ని పెంచుతాయి. స్పాటిఫై వంటి మ్యూజిక్ ఛానెల్ వినియోగిస్తే ‘స్క్రీన్ ఆఫ్’, ‘డిస్‌ప్లే ఆఫ్’ లేదా ‘ఆడియో ఓన్లీ’ ఆప్షన్ కోసం చూడండి. లేకుంటే బ్రైట్‌నెస్ తగ్గించుకోవచ్చు.