ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భూమి కుంగిపోతోందని తాజా ఉపగ్రహ సర్వే హెచ్చరించింది. భూగర్భ జలాలను ఎక్కువగా తోడటం వల్ల హ్యూస్టన్, న్యూయార్క్, షాంఘై, బీజింగ్ నగరాల్లో ఈ ముప్పు పొంచి ఉంది. ఈ ప్రమాదాల వల్ల భవనాలు, మురుగునీటి వ్యవస్థలు దెబ్బతినడమే కాకుండా వరదలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని పెకింగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వెల్లడించారు.