ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు విజయవాడలో 5కె రెడ్‌ రన్‌ నిర్వహించారు. ఏపీఎస్‌ఏసీ ప్రాజెక్టు డైరెక్టర్‌ స్మరణ రాజ్‌ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణపై యువతకు అవగాహన అవసరమన్నారు. తొలిదశలోనే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చని, బాధితుల పట్ల వివక్ష చూపవద్దని ఆయన కోరారు.