క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్‌ యాదవ్‌ సూచించారు. మంగళగిరి నుంచి రాష్ట్రవ్యాప్త 'జోష్' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ అవగాహన బృందాల్లో ప్రభుత్వ అధికారులు, మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, ఎన్‌సీసీ క్యాడెట్లు ఉంటారు.