క్షయ రహిత భారత్ లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ‘జోష్ టీం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల్లో టీబీ కేసులు లేని 46 గ్రామాలకు సిల్వర్, బ్రాంజ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షయ వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తించి, బాధితులకు మందులు, పౌష్టికాహారం అందించడం ఈ టీం బాధ్యత.