హర్ముజ్ జలసంధిలో సముద్ర మైన్‌ను ఢీకొన్న ఒక భారీ కార్గో నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలోని మొత్తం 21 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. వైరల్ వీడియోలో సముద్రం పైభాగంలో తేలియాడుతున్న ఐఫోన్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లను చూడవచ్చు. ఈ ప్రాంతంలో దాడులు, ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని సమాచారం.