దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగో రోజూ లాభపడ్డాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 1,225 పాయింట్లు పెరిగి 76,917.85 వద్ద, నిఫ్టీ 370 పాయింట్లు లాభపడి 23,810.85 వద్ద స్థిరపడ్డాయి. క్రూడాయిల్ ధర 105 డాలర్ల దిగువకు చేరడం, విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టడం కలిసొచ్చిందని జియోజిట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.