తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల సరఫరా పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. నవంబర్ 3న హైదరాబాద్ కూకట్‌పల్లి రైతు బజార్‌లో కిలో టమాటా రూ. 29, వంకాయ రూ. 18, బెండకాయ రూ. 45, క్యాబేజీ రూ. 13కు విక్రయించారు. పంట దిగుబడి మార్కెట్‌కు రావడంతో దీపావళి వేళ సామాన్యులకు ఉపశమనం లభించింది.