రైల్వే కౌంటర్లలో టికెట్లు తీసుకునే ప్రయాణికులకు కూడా రూ.10 లక్షల ప్రమాద బీమాను కల్పించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 27 నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకు ఆన్‌లైన్ టికెట్లకు మాత్రమే 45 పైసలకే ఈ సదుపాయం ఉండేది. ప్రమాదంలో మరణించినా లేదా గాయపడినా క్లెయిమ్ పొందవచ్చు.